TG: సిద్దిపేటలోని హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అక్కడ జరుగుతున్న కులగణన సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలను సరిచేయడానికి కులగణన సమాచారం ఉపయోగపడుతుందని చెప్పారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ప్రజలను సూచించారు. ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాంటిదని పేర్కొన్నారు.