KDP: మైలవరం రిజర్వాయర్లో 5.91 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గురువారం అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్లో 658.25 అడుగుల వద్ద నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు. గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్లోకి ఇన్ ఫ్లో ఏమీ లేదు. రిజర్వాయర్ నుంచి దిగువకు 400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.