లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 2022లో రాజస్థాన్లోని గంగాపూర్ నగరంలో నమోదైన లైంగిక వేధింపుల కేసును ఫిర్యాదుదారు, నిందుతుడు రాజీ కుదుర్చుకోవడంతో.. ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీనిని రాజ్ జీ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో.. కేసును తిరిగి విచారించాలని తీర్పుచెప్పింది.