Akp: ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు చిన్నయాదవ్ కోరారు. గురువారం అనకాపల్లి ఎంఈవో శ్రీదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. చిన్ని యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా సరిగా పెట్టడం లేదన్నారు.