AP: సర్పంచుల డిమాండ్లలో కీలకమైనవి గుర్తించి పూర్తిచేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ‘కేరళ అధికారి కృష్ణతేజను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చాం. కృష్ణతేజ సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తాం. నా పేషీలో ప్రజలకు మేలు చేద్దామన్న అధికారులు ఉండటం నా అదృష్టం. గత ప్రభుత్వం పెండింగ్ నిధులు కూడా విడుదలకు కేబినెట్లో నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.