తమకు కేంద్రం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని వికీమీడియా ఫౌండేషన్ పేర్కొంది. ‘వికీపీడియా వాలంటీర్లు వారికి తెలిసిన సమాచారాన్ని సైట్లో అప్లోడ్ చేయరు. విశ్వసనీయ వార్తాసంస్థలు, ప్రముఖ ప్రచురణ సంస్థల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మా ఆర్టికల్స్‌ను విశ్వసిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు మా సైట్‌కు కంటెంట్‌ను అందిస్తున్నారు’ అని తెలిపింది.