బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడిగా ఉంటున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిషేక్, ఐశ్వర్యరాయ్లు కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.