AP: గుంటూరు జిల్లాలో ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు రెస్టౌరెంట్కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో బోరుగడ్డకు రాచమర్యాదలు చేయడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.