బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ‘ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా ఉంది. మహ్మద్ షమీ లేకపోవడం రోహిత్ సేనకు పెద్ద ఎదురుదెబ్బ. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై 20 వికెట్లు తీయడం భారత్‌కు పెద్ద సవాలుగా మారుతుంది. ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుస్తుంది’ అని పాంటింగ్ తెలిపాడు.