TG: సిద్ధిపేట జిల్లాలోని రాఘవాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీమంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ ఫెయిల్యూర్‌తో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదని.. రాబందుల ప్రభుత్వమని అన్నారు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని సూచించారు.