రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. అయితే, అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.