హీరో కంపెనీ తన ఎక్స్‌పల్స్ మోడల్ బైక్‌లో 210 సీసీ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. దీన్ని కంపెనీ EICMA 2024 ఈవెంట్లో ఆవిష్కరించింది. ఇది లేటెస్ట్ ఇంజిన్ టెక్నాలజీతో రానుంది. అంతేకాకుండా 210CC సింగిల్-సిలిండర్ కావడంతో 24.5 bhp పవర్, 20.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో రానుండటంతో సుదూర ప్రయాణాలు చేసే కుర్రకారులను ఆకట్టుకుంటోంది.