TG: సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనపై KTR చేసిన ఆరోపణలపై జలమండలి వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై విచారణ కమిటీ వేశామని.. ఆ కమిటీ నివేదిక సమర్పించిందని తెలిపింది. కాంట్రాక్టర్ నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేదని.. అతనికి నోటీసులు ఇవ్వాలని కమిటీ సూచించిందని పేర్కొంది. ఈ ఘటనపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కూడా విచారించాయని.. సమగ్ర విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.