NRML: లోకేశ్వరం మండలం పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4,200 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. బుధవారం ఇరిగేషన పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా అయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 58 కోట్లు మంజూరు కాగా అప్పటి పాలకులు పట్టించుకోలేదని, గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వంతో కొట్లాడి అదనంగా రూ.19 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు.