అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అయితే గత అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత ట్రంప్ అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. ఓ కేసులో ట్రంప్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చగా.. మాజీ అధ్యక్షుడు అరెస్టయ్యారు. దీంతో పాటు పలు కేసుల్లో ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కాగా, ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్న వేళ.. ఆయనపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులు తాజాగా తెరపైకి వస్తున్నాయి.