GNTR: ప్రజా సమస్యలపై అధికారులు అలసత్వం వహించకుండా సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం మేడికొండూరు మండలంలో గ్రామసభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.