NRML: భైంసా పట్టణంలోని స్థానిక గడ్డెన్న సుద్దవాగు ప్రాజక్ట్ లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదోల్ ఎమ్మేల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని చేప పిల్లలను ప్రాజక్ట్ లో వదిలారు. ఈ ఏడాది 13 లక్షల చేప పిల్లలను విడుదల చేయనున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.