US: స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం బిలియనీర్ ఎలాన్ మస్క్ 1 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రవేశపెట్టారు. తాజాగా ప్రైజ్‌మనీ విషయంలో మస్క్ మోసం చేశారని ఓ మహిళ ఫెడరల్ కోర్టులో దావా వేశారు. లక్కీ డ్రాతో విజేతలను ఎంపిక చేస్తానని చెప్పి, ముందుగా నిర్ణయించుకున్న వారికే ప్రైజ్‌మనీ ఇస్తున్నారని ఆరోపించారు. మస్క్, అతనికి సంబంధించిన అమెరికా ప్యాక్ సంస్థ ఓటర్లను మోసం చేసిందని విమర్శించారు.