తమిళ నటి కస్తూరి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కస్తూరి మాటలను వెనక్కి తీసుకున్నప్పటికీ ఆమెపై పలు తెలుగు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. కాగా, తమిళ రాజుల వద్దకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తాము తమిళులం అంటూ మాట్లాడుతున్నారని కస్తూరి వ్యాఖ్యానించారు.