ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు హైదరాబాద్‌లోని సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో భాను కిరణ్‌కు బెయిల్ లభించింది. అయితే సూరి హత్య కేసులో గతంలో కోర్టు జీవితఖైదు విధించడంతో.. బెయిల్ వచ్చినా అతడు జైల్లోనే ఉండనున్నాడు. దీంతో పూజారి కరుణించినా దేవుడు వరమివ్వలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.