TG: మహాలక్ష్మీ పథకంతో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ధర్నాలో BRS నేత KTR పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆటో డ్రైవర్లు.. KTRపై మండిపడ్డారు. తాము KTRను ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. పదేళ్ల BRS పాలనలో ఆటోడ్రైవర్లకు చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు. వ్యక్తిగత, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆయన ధర్నాకు వచ్చారని ఆరోపించారు.