అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికాకు ట్రంప్ కంటే మెరుగైన అధ్యక్షుడు అవసరమని అన్నారు. అక్కడి ప్రజల పాత్ర, భాద్యతలు అర్థం చేసుకునే వ్యక్తి కావాలి, కానీ ట్రంప్ కాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచానికే ఆదర్శంగా కనిపించే నాయకుడు అగ్రదేశానికి అధ్యక్షుడిగా ఉండాలని హారిస్ పేర్కొన్నారు.