SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సమగ్ర సర్వే పై శనివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, మండల, పట్టణ, బ్లాక్ అధ్యక్షులు, మహిళా నాయకులు, NSUI, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.