NLG: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో పెరగడంతో ఒక గేటు ఒకఅడుగు మేర ఎత్తి 646.87 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 644.22 అడుగులు ఉండగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 834.49 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 834.49 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారి ఉదయ్ తెలిపారు.