GNTR: తనపై ఆరోపణలు చేసి, ఫిర్యాదు చేసిన మహిళతో తనకెలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎలాంటి టెస్ట్లకైనా సిద్ధమని ప్రకటించారు. తాను ఆమె దగ్గర రూ.90 లక్షలు తీసుకున్నానని, ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నించానని చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.