TG: ఈనెల 6 నుంచి జరగబోయే కులగణనకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కులగణనకు ఉపాధ్యాయులను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. 36,559 మంది SGTలతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను కేటాయించింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే SGTలకు మినహాయింపు ఇచ్చింది. ప్రైమరీ పాఠశాలలకు ఉదయం 9 నుంచి ఒంటిగంట వరకే తరగతులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రైమరీ స్కూల్ స్టాఫ్కు కులగణన బాధ్యతలు అప్పగించారు.