SRCL: సిరిసిల్ల జిల్లాలో మూగజీవాల జాతుల లెక్క తేలనుంది. మూగజీవాల వివరాలు సేకరించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 21వ పశు గణన కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 2025 వరకు ప్రక్రియ కొనసాగనుంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 255 గ్రామ పంచాయితీల పరిధిలోని 16 రకాల పశుజాతుల వివరాలు సేకరించనున్నారు.