హర్యానా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈసీ సమాధానంపై తాజాగా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సంఘం తరుచూ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నేతలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఇలాంటి వ్యాఖ్యలే కొనసాగిస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.