VZM: దత్తిరాజేరు మండలంలోని గదబవలస, చినచామలపల్లి అంగన్వాడీ కేంద్రాలను సిడిపిఓ నాగమణి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, చిన్నారుల ఎత్తు, బరువులు, హాజరు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో లబ్ధిదారులందరూ ఈకేవైసీ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. అలాగే బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించాలన్నారు.