AP: మహిళలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని.. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు.