ATP: రాయదుర్గంలో 17వ వార్డులో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. అందులో భాగంగానే దీపావళి రోజున మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.