NLR: నగరంలోని దీన్ దయాళ్ నగర్ లో రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్లను అందించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి స్థానిక ప్రజలతో ముచ్చటించారు. ఆయన వెంట పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.