ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తమ యూజర్లకు ‘కస్టమ్ లిస్ట్’ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు వారికి నచ్చినట్టుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆఫీస్ ఇలా లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమర్ల కమ్యూనికేషన్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు సదరు యాప్ తెలిపింది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది.