NLD: కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కలుగొట్ల గ్రామ ప్రజలు, టిడిపి నాయకులు మంత్రి కి ఘన స్వాగతం పలికారు. మంత్రి బీసీ పెన్షన్ లబ్దిదారుల ఇళ్ల దగ్గరకు స్వయంగా వెళ్లి పింఛన్ ను పంపిణీ చేశారు.