AP: విశాఖ జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. గోపాలపట్నం ఇంద్రనగర్‌లో ఉన్న జనసేన కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్యకర్తలు బయటకు పరుగులు తీశారు. అయితే దీపావళి క్రాకర్స్ కారణంగా మంటలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. స్థానికులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెనుప్రమాదం తప్పింది.