TG: రాష్ట్రంలో వరికోతలు సాగుతున్నప్పటికీ రైతుబంధు, రైతు భరోసా ఊసేలేదని మాజీ మంత్రి KTR అన్నారు. కనీసం పంట కొనుగోలు కూడా చేయడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. అకాల వర్షాలకు చాలా చోట్ల ధాన్యం తడిసిపోతుందన్నారు. ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని.. అక్టోబర్ 28 వరకు కేవలం 7,629 టన్నుల ధాన్యాన్నే కొన్నారని ఎద్దేవా చేశారు. దళారులతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదని మండిపడ్డారు.