AP: వైసీపీ మునిగిపోయిన నావ.. అందులో ఒకరిద్దరు కూడా మిగలరని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. వాలంటీర్లు లేకుండా పింఛన్ సాధ్యం కాదన్నారు.. ఇప్పుడు చూస్తున్నారా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించే ఆలోచన చేస్తున్నామన్నారు. విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేలా లోకేశ్ కృషి చేస్తున్నారన్నారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి జగన్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు.