మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. నవంబర్ 9న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేస్తూ ఫొటోను షేర్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.