టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో సుజిత్, సందీప్‌ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘క’. థియేటర్లలో ఇవాళ విడుదలై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారా ఈ విషయం తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్‌గా నటించారు.