తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ టీ.జే జ్ఞానవేల్ తెరకెక్కించిన మూవీ ‘వేట్టయాన్’. అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేసింది.