టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ‘క’ మూవీ ఇవాళ థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. దీని OTT హక్కులను ఈటీవీ విన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను ఈటీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుజిత్, సందీప్‌లు ఈ సినిమాను తెరకెక్కించారు.