CTR: నవంబర్ 1వ లబ్ధిదారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్ పొందేవారు ఇంటి వద్దే సిబ్బందికి అందుబాటులో ఉండాలని సూచించారు. లేని పక్షంలో 2వ తేదీన తప్పక అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.