W.G: భీమవరం పట్టణానికి రాబోయే మాసాలలో సుందరీకరణతో కొత్త రూపు సంతరించుకొనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం సుందరీకరణ పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో సుదీర్ఘంగా సమీక్షించారు.