SKLM: హిరమండలం మండల సమాఖ్య కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం VOAలు, మండల సమైక్య సిబ్బందితో సమావేశం నిర్వహించినట్లు వెలుగు ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులైన నిరక్షరాశులను ముందస్తుగా గుర్తించాలని సూచించారు. వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ పథకం ద్వారా అక్షర జ్ఞానంతో పాటు డిజిటల్ లీగల్ ఎడ్యుకేషన్ అందిస్తామన్నారు.