AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రజలకు ఉచితంగా గ్యాస్ బండలు అందిస్తూ మరో వైపు విద్యుత్ చార్జీలు పెంచడం అన్యాయమన్నారు. సుమారు 6 వేల కోట్ల రూపాయలు భారం వేశారన్నారు.