VZM: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి.దేవి సిబ్బందితో సోమవారం ఆకస్మిక దాడులు చేపట్టగా సొంపురం గ్రామంలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.12,880 విలువ గల బాణసంచా సామాగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. గ్రామాల్లో సంబంధిత అధికారుల నుండి ముందుస్తు అనుమతి లేకుండా బాణసంచా నిల్వలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.