VZM: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసిందని సీఐ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది, యువత, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్త దానం చేశారని, ఈ శిబిరంలో మొత్తం 154 యూనిట్ల రక్తాన్ని సేకరించామన్నారు. జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.