భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి మెరుగైన స్థితిలోనే ఉంది. అయినా అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోక తప్పదని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ప్రస్థుత రాజకీయ పరిణామాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అనుసరిస్తున్న విధానాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ప్రభావితమవుతోంది. ప్రస్థుత ఆర్థిక వృద్ధి 6.5-7% ఉండనున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల దేశ ప్రజలు ఖర్చు చేసే విధానం తగ్గవచ్చని తెలిపింది.