VSP: విశాఖ జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 89 వినతులు అందాయని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధికారుల బృందం స్వీకరించింది. అర్జీలను తక్షణం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను మేయర్ వెంకట కుమారి, కమిషనర్ సంపత్‌కుమార్ ఆదేశించారు.