GNTR: నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని మంగళగిరి రూరల్ ఎస్సై సీహెచ్. వెంకట్ అన్నారు. సోమవారం మంగళగిరి పరిధి పెదవడ్లపూడి గ్రామంలో కోకో కోలా కంపెనీ సహకారంతో నాలుగు సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వారి వ్యాపార సంస్థల్లో, నివాసాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను నియంత్రించవచ్చని అన్నారు.